తమ వల్ల కొడుకులకు కరోనా వస్తదని వృద్ధ దంపతుల సూసైడ్

హైదరాబాద్ లో దారుణ జరిగింది. తమ నుంచి కొడుకలకు కరోనా వస్తుందనే భయంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మాకు కరోనా వచ్చింది. పది రోజులుగా దగ్గు,జ్వరం తగ్గడం లేదు. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం.. మా నుంచి మా పిల్లలక కూడా కరోనా సోకుతుందేమోనని ఆత్మహత్య చేసుకుంటున్నాం అని సూసైడ్ నోట్ లో తెలిపారు.. ఖైరతాబాద్ లోని ఎమ్ఎస్ మక్తాలో శనివారం జరిగిన ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. వివరాలను ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

10 రోజులుగా జ్వరం

యడమ వెంకటేశ్వర నాయుడు (63).. టీఎస్‌ఎఫ్‌డీసీ లో డ్రైవర్‌‌గా పనిచేసి రిటైర్‌‌అయ్యారు. భార్య వెంకటలక్ష్మి (60)తో కలిసి ఖైరతాబాద్‌ ఎమ్ఎస్‌ మఖ్తాలోని ఓ అద్దెఇంట్లోఉంటున్నాడు. వీరిద్దరూ 10 రోజులుగా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారు. ఇదే విషయం దగ్గర్లో ఉంటున్న తన కొడుకులు రవి, నాగరాజుకు చెప్పారు. తమకుకరోనా లక్షణాలు ఉన్నాయని తెలిపారు. దీంతో తల్లిదండ్రులకు ఆయన కుమారుడు రవి శనివారంఉదయం కాల్‌చేశాడు. ఫోన్‌ లిఫ్ట్చేయకపోవడంతో దగ్గర్లోనే ఉండే తన సోదరుడు నాగరాజును ఇంటికి పంపించాడు. 11.30 గంటల టైంలో అక్కడికి చేరుకున్న నాగరాజు..పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడిపోయిన తల్లి దండ్రులను కిటీకిలో నుంచిచూశాడు. పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంకట లక్ష్మి రాసిన సూసైడ్‌నోట్‌ స్వాధీనం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

Latest Updates