నిమ్జ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత.. రైతులపై లాఠీచార్జ్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిమ్జ్ ఏర్పాటుపై చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. నిమ్జ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి వస్తున్న 17గ్రామాల రైతులను పోలీసులు అడ్డుకున్నారు. మామిడ్గ గ్రామం దగ్గర రైతుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కొంతమందికి తీవ్రగాయాలు అయ్యాయి.  చాలామంది రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు. సమావేశ ప్రాంగణంలో పోలీసులు, అధికారులు తప్ప ఎవరూ లేరు. ప్రజాభిప్రాయానికి హాజరైన కొద్దిమంది రైతులు కూడా భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు.  సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి రైతులు నిరసన కొనసాగుతూనే ఉంది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేసిన 100 మంది రైతులను అరెస్ట్ చేశారు.

see more news

LRS పై విచారణ.. హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఎట్టకేలకు కనిపించిన జాక్ మా.. ఇన్నాళ్లు ఎక్కడ?

Latest Updates