కరోనా డ్రగ్.. ప్రయోగం విఫలం!

కరోనా వైరస్ ని అరికట్టేలా డ్రగ్స్ పై జరుపుతున్న ప్రయోగాలు విఫలమవుతున్నట్లు తెలుస్తోంది.

కరోనా చికిత్సకు అమెరికా కంపెనీ ‘గిలియడ్‌’ ఉత్పత్తి చేసిన రెమెడిసివిర్‌ పై పరిశోధనలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఆ డ్రగ్స్ మనుషులుపై ప్రయోగించినట్లు, ఆ ప్రయోగంలో మంచి ఫలితాలు నమోదవుతున్నాయని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంతో రెమెడిసివిర్ కరోనా ను నయం చేస్తుందని, త్వరలో ఆ డ్రగ్ అందుబాటులోకి వస్తుందని అందరూ అనుకున్నారు.

కానీ గిలీద్ కంపెనీకి చెందిన డ్రగ్ రెమెడిసివిర్ ను మనుషులపై చేసిన  ప్రయోగం విఫలమైందంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన వెబ్ సైట్ లో యాడ్ చేసింది. కొద్దిసేపటికి ఆ స్క్రీన్ షాట్ ను తొలగించింది. స్వల్ప వ్యవధిలోనే రెమెడిసివిర్ డ్రగ్ పై వివాదం వైరల్ అయ్యింది.

వివాదంపై స్పందించిన గిలీద్ కంపెనీ యాజమాన్యం మనుషులపై రెమెడిసివిర్ డ్రగ్ విఫలమైనట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది.

అయితే ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం ..చైనాలో కరోనా వైరస్ సోకిన 237మందిని రెండు భాగాలుగా విభజించి వారిలో 158 మందికి రెమెడిసివిర్ ను ప్రయోగించారు.  79 మందికి ఎలాంటి ఔషధాలు ఇవ్వకుండా పరిశీలించారు. నెల రోజుల తరువాత డ్రగ్ ను ప్రయోగించిన 13.9శాతం మందిలో  12.8శాతం మృతి చెందారని డబ్ల్యూహెచ్ ఓ యాడ్ చేసిన ముసాయిదా గురించి ప్రస్తావించింది.

ట్రయల్స్ కు రోగులు ముందుకు రావడం లేదు

డబ్ల్యూహెచ్‌ఓ చర్యతో గిలీడ్‌ సైన్సెస్‌ తీవ్రంగా విభేదించింది. అధ్యయనానికి సంబంధించిన ఫలితాలపై తప్పుడు నివేదిక ప్రచురించిందని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, క్లినికల్ ట్రయల్స్‌కు రోగులు పెద్దగా ముందుకు రాలేదని.. అందుకే పరీక్షల్ని తొలిదశలోనే నిలిపివేశామని తెలిపారు. తక్కువ మందిపై ప్రయోగించి ఓ నిర్ణయానికి రావడం సరికాదని పేర్కొన్నారు.

Latest Updates