సిటీ బస్సుల్లో కండక్టర్ల దోపిడీ

షల్​ మీడియాలో
వీడియో హల్​చల్​

హైదరాబాద్ : సిటీ బస్సుల్లో కండక్టర్ల దోపిడీకి  నిదర్శనంగా ఆరాంఘర్ వెళ్లే బస్సులో ఓ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. రూ.9 ల ఛార్జీకి గాను రూ.18 లు ఇవ్వాలంటూ కండక్టర్ డిమాండ్ చేశాడు. ఎందుకు ఎక్కువగా ఇవ్వాలంటూ ప్రయాణికుడు ప్రశ్నించటంతో పాటు టిక్కెట్ ఇవ్వాలని కోరాడు. దీనికి కండక్టర్ టిక్కెట్ లేదంటూ అడిగినంత ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. ఆర్టీసీ అధికారులేమో బస్సు ఛార్జీల కన్నా ఎక్కువ తీసుకోవద్దని చెబుతుంటే కొత్త కండక్టర్లు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నగరంలో ఇలాంటి సంఘటనలు రోజుకు వందల కొద్దీ జరుగుతున్నాయి.

Latest Updates