ఆసీస్ పిచ్‌లకు భయపడాల్సిన అవసరం లేదు

సిడ్నీ: కంగారూ సిరీస్‌‌కు సమయం దగ్గర పడుతోంది. భారీ సిరీస్‌‌కు టీమిండియా ప్లేయర్లు కసరత్తులు ముమ్మరం చేశారు. పేస్, స్వింగ్‌‌కు అనుకూలించే పిచ్‌‌లపై రాణించడం బ్యాట్స్‌‌మెన్‌కు సవాలనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కంగారూ పిచ్‌‌ల గురించి ఆస్ట్రేలియా లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌‌గ్రాత్ పలు విషయాలు పంచుకున్నాడు. గతంలో మాదిరి ఆస్ట్రేలియా పిచ్‌లు మరీ ప్రమాదకరంగా లేవన్నాడు.

‘పేస్, బౌన్స్ విషయంలో ఆసీస్ పిచ్‌‌ల గురించి మరీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ పిచ్‌‌లు గతంలోలా మరీ వేగంగా, బౌన్సీగా లేవు. అయితే ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడి పిచ్‌‌ల్లో మంచి పేస్, బౌన్స్ ఉంది. భారత క్రికెటర్లు కంగారూ పిచ్‌‌ల గురించి భయపడతారని అప్పట్లో వినేవాళ్లం. కానీ టీ20 క్రికెట్ వచ్చాక అలాంటి ఆందోళనలు, భయాలకు చోటు లేకుండా పోయింది. నేను 1993లో అరంగేట్రం చేసినప్పుడు ఆస్ట్రేలియాలోని ప్రతి పిచ్‌‌కు దానికంటూ ప్రత్యేక స్వభావం ఉండేది. వాకా పిచ్ వేగంగా, బౌన్సీగా ఉండేది. సిడ్నీలో టర్న్ చాలా ఉండేది. గబ్బాలో రివర్స్ స్వింగ్, ఎంసీజీలో గేమ్ మరింత వైవిధ్యంగా ఉండేది. అది ఆసీస్‌ టీమ్‌‌ను పటిష్టంగా తయారు చేసింది. నా కెరీర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియాలోని అన్ని పిచ్‌‌లు ఒకేలా తయారయ్యాయి. అది నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది’ అని మెక్‌‌గ్రాత్ పేర్కొన్నాడు.

Latest Updates