వేగంగా యాదాద్రి నిర్మాణ పనులు..త్వరలో గర్భాలయం దర్శనం

యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహ్మస్వామి దివ్య క్షేత్రం పునర్నిర్మా ణ క్రతువు ఊహలకందని రీతిలో సాగుతోంది. శ్రీలక్ష్మీ నారసింహుడు కొలువు దీరే ప్రధానాలయం పనులు తుది అంకానికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ప్రారంభ ఘట్టాన్ని పూర్తి చేయడమే తరువాయి బాలాలయంలోని శ్రీలక్ష్మీ నారసింహుడు గర్భాలయంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన దేవాలయ పునర్నిర్మా ణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.650 కోట్లు ఖర్చుచేశారు. మొదటి దశలోని ప్రధానాలయం పనులు పూర్తికావొచ్చాయి. ఫినిషింగ్‍ తప్ప మిగతా పనులన్నీపూర్తయ్యాయి . ప్రధానాలయం చుట్టూ ఏడు రాజగోపురాలు నిర్మించా రు.  ప్రధానాలయానికి పశ్చిమం వైపు సప్తతల రాజగోపురాన్ని , నలు దిక్కులా నాలుగు పంచతల రాజగోపురాలను, గర్భా లయం మీద దివ్య విమాన రాజగోపురాన్ని , గర్భా లయానికి ముందు త్రితల రాజగోపురాల నిర్మాణాలను పూర్తి చేశారు.ప్రధానాలయం చుట్టూ అష్టభుజి ప్రాకార మండపం పనులు కూడా పూర్తయ్యాయి . ప్రాకార మండపం పైభక్తులను ఆకట్టుకునేలా సింహాకృతిలో యాలీ ఫిల్లర్లను ఏర్పాటు చేశారు.

ముమ్మరంగా రెండో దశ పనులు

ప్రధానాలయం మినహా గుట్టపైన మిగతా నిర్మాణాలను రెండో దశలో చేపట్టారు. గుట్ట చుట్టూ ప్రహరీనిర్మాణం, గ్రీనరీ పనులు కూడా పూర్తయ్యాయి . గుట్టకింది నుంచి పై వరకు మూడు అంచెల్లో గ్రీనరీనిఏర్పాటు చేశారు. ప్రధానాలయానికి తూర్పు దిశలో శివాలయం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సత్యనారాయణ వ్రత మండపం నిర్మాణం స్లాబ్‍ వరకు పూర్తయ్యిం ది. సీఎం కేసీఆర్‍ సూచనలతో మండపం పై భాగంలోని కొంత నిర్మాణాన్ని తొలగించారు.మరో వైపు విష్ణు పుష్కరిణి విస్తరణ, ప్రసాద శాలపనులు జరుగుతున్నాయి. త్వరలో గుట్టపైన సీసీ రోడ్లనిర్మాణం, ఫ్లోరింగ్‍ పనులు చేపట్టనున్నారు.

మొదలైన మూడో దశ పనులు

యాదాద్రి దేవాలయ విస్తరణలో భాగంగా గుట్టకింద నిర్మాణాలను, రోడ్ల విస్తరణను మూడో దశలో చేపట్టారు. టెంపుల్‍ సిటీ నిర్మాణానికి కూడా కసరత్తు జరుగుతోంది. యాదాద్రికి వచ్చే భక్తులు అవసరమైతే ఇక్కడే బస చేసేలా కాటేజీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ కాటేజీలను దాతల నిర్మాణంతో చేపట్టాలనిసీఎం కేసీఆర్‍ నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రముఖులు, ప్రముఖ సంస్థల నుంచి పెద్దఎత్తున విరాళాలను సేకరించి, వారి పేరుతోనే కాటేజీలను నిర్మించేందుకు నిశ్చయించా రు. త్వరలో దాతల సహాయంతో కాటేజీల నిర్మా ణానికి 305ప్లాట్లను రెడీ చేసి పెట్టారు.మరోవైపు వీవీఐపీలు దర్శనం కోసం వచ్చినప్పుడుఉండేం దుకు ప్రెసిడెన్ షియల్‍ సూట్స్ నిర్మాణం కూడాచేస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్‍, సీఎంతో పాటు ఇతరవీవీఐపీల కోసం భవనాల నిర్మాణం చేపట్టనున్ నారు.ప్రస్తుతం ప్రెసిడెన్ షియల్‍ సూట్స్ భవనాల నిర్మాణపనులు మొదలయ్యాయి .

Latest Updates