సింగరేణిలో వరల్డ్ ఫేమస్ లవర్

విజయ్‌‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్‌‌‌‌’లో నలుగురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఐశ్వర్యా రాజేష్‌‌, ఇజబెల్లె లీట్ ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. శనివారం క్యాథరీన్​ థ్రెసా లుక్ రిలీజయ్యింది. ఇందులో క్యాథరీన్‌‌కి, సింగరేణి ప్రాంతానికి లింక్‌‌ ఉంది. ‘బొగ్గు గనిలో నా బంగారం, నా వరల్డ్‌‌ ఫేమస్‌‌ లవర్‌‌. ఈ వేలంటెన్స్‌‌ డేకి శ్రీనును కలుసుకుందాం’ అంటూ క్యాథరీన్‌‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శ్రీను పాత్రలో ఖాకీ చొక్కా, ప్యాంటు వేసుకుని సింగరేణి కార్మికుడిగా కనిపిస్తున్నాడు విజయ్‌‌. గర్ల్‌‌ఫ్రెండ్‌‌ స్మితతో కలిసి సరదాగా నవ్వుతూ తుళ్లుతూ నడుస్తున్నాడు. గత రెండు లుక్స్‌‌కి, ఈ లుక్‌‌కి చాలా డిఫరెన్స్ ఉండటం విశేషం.

Latest Updates