కరోనాతో ఏపీ కాపు కార్పోరేషన్ తొలి ఛైర్మన్ మృతి

ఏపీ కాపు కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ చలమశెట్టి రామానుజయ కరోనాతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామానుజయ ఇటీవల కరోనా లక్షణాలతో  విజయవాడ జీజీహెచ్ లో చేరారు. గత నాలుగు రోజులుగా రామానుజయకు వెంటిలేటర్ పై వైద్యం అందించారు డాక్టర్లు. పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. రామానుజయ కాపు కార్పోరేషన్ కు తొలి ఛైర్మన్ గా పనిచేశారు.

చలమమశెట్టి రామానుజయ మృతికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. రామానుజయ మృతి టీడీపీకి తీరని లోటన్నారు. కాపుల సంక్షేమం కోసం రామానుజయ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. కాపు రిజర్వేషన్లు, విద్యార్థుల విదేశీ విద్య,రుణమేళాలు,జాబ్ మేళాలు, మహిళల స్వయం ఉపాధి పథకాల రూపకల్పనలో రామానుజయ క్రియాశీలక పాత్ర హించారన్నారు. రామానుజయ మృతి పట్ల టీడీపీ నేతలు లోకేశ్, నక్కా ఆనంద్ బాబు,దేవినేని ఉమ పలువురు నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 96,551 కేసులు..1209 మరణాలు

చైనా ఆక్రమిత భూమిని ఎప్పుడు స్వాధీనం  చేసుకుంటారు?

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతల అరెస్ట్

రాష్ట్రంలో మరో 2,426 కరోనా కేసులు

Latest Updates