ఆగస్టు 15న ‘సీతారామ’  రన్​

భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు/ ముల్కలపల్లి, వెలుగు :   భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్​ మొదటి దశ పంప్​ హజ్​లో  ఏర్పాటు చేసిన రెండు మోటార్లకు ఆగష్టు 15న డ్రై రన్​ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​చెప్పారు.  ప్రాజెక్ట్​ పనులను ఇరిగేషన్​ ప్రిన్సిపల్​సెక్రటరీ రజత్​కుమార్​, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్​, ఇంజనీర్​ ఇన్​ ఛీఫ్​ మురళీధర్​, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెండారెడ్డిలతో కలిసి మంత్రి శుక్రవారం పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్​ ఏజెన్సీలతో వీకే రామవరం వద్ద  సమీక్షించారు. రెండు పంటలకు సాగునీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్​ను చేపట్టిందని మంత్రి చెప్పారు.  బీజీ కొత్తూరు వద్ద ఆరు మోటార్లకు గాను రెండు మోటార్ల బిగించినట్టు తెలిపారు. వీకే రామవరం వద్ద మోటార్ల ఏర్పాటు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి పంప్​ హౌజ్​​ దగ్గర దాదాపు 29 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తి పోసి అక్కడి నుంచి కాలువల ద్వారా వీకే రామవరం, అక్కడి నుంచి కమలాపురం వరకు కాలువల ద్వారా నీరు పారుతుందన్నారు. ఇందుకు అవసరమైన పంపులు జైలం నుంచి,  మోటార్లు షాంఘై  రావాల్సి ఉందన్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని అయిన సీతారామ ప్రాజెక్ట్​ఎనిమిది ప్యాకేజీలకు సంబంధించిన పనులు డిసెంబర్​లోపు పూర్తి చేయాలన్నారు. సీతమ్మ ధార ప్రాజెక్ట్ భూసేకరణ జరుగుతుందని అన్నారు. కరోనా వల్ల పనుల్లో కొంత ఇబ్బంది కల్గిందని ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ రజత్​కుమార్ అన్నారు. సాధారణంగా ఏప్రిల్​, మే నెలల్లో పనులు వేగంగా సాగుతాయని, కానీ ఈ సారి  కొంత జాప్యం జరిగిందన్నారు. లేబర్​ సమస్య ఉందన్నారు.  ఆగష్టు 31లోపు డ్రైరన్ చేసి డిసెంబర్​ 31 వరకు నీళ్లను ఎత్తిపోసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్​ రేగా కాంతారావ్​, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, అశ్వారావ్​పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్​ రావ్​, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు ఎంవి. రెడ్డి, కర్ణన్​లు పాల్గొన్నారు.

గౌరవెల్లి పనులను అడ్డుకున్న నిర్వాసితులు

 

Latest Updates