కనిపించకుండా పోయిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు

ప్రముఖ వ్యాపారవేత్త, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు V G సిద్ధార్థ కనిపించకుండా పోయారు. కర్ణాటకలోని మంగళూరు సిటీలో ఆయన అదృశ్యమయ్యారు. సిద్ధార్థ చివరగా…. మంగళూరు శివారులోని నేత్రావతి నది దగ్గర కనిపించారు. నిన్న బెంగళూరు నుంచి బయల్దేరిన సిద్ధార్థ… సక్లేష్ పూర్ వెళ్తున్నట్టు కుటుంసభ్యులకు తెలిపారు. మార్గమధ్యంలోనే మంగళూరు వెళ్లాలని డ్రైవర్ కు చెప్పారు. నేత్రావతి నది బ్రిడ్జ్ దగ్గరకు రాగానే… కార్ దిగి… డ్రైవర్ ను వెళ్లిపోమన్నట్టు మంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఆయన నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మంగళూరు సిటీ పోలీసులు, రెస్కూ బృందాలు, స్థానిక మత్స్యకారుల సాయంతో నదిలో గాలిస్తున్నారు. ఎనమిది కోస్ట్ గార్డ్, NDRF టీములు.. సిద్ధార్థ కోసం గాలిస్తున్నాయని చెప్పారు దక్షిణ కన్నడ జిల్లా కమిషనర్ శశికాంత్ సెంథిల్. మరోవైపు సిద్ధార్థ ఆచూకీ కనుగొనాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు కర్నాటక ఎంపీలు, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కి లేఖ రాశారు.

కాఫీ డే ఉద్యోగులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు 27న లెటర్ రాశారు సిద్దార్థ. ప్రతీ ఆర్థిక లావాదేవీకి తనదే బాధ్యత అని లెటర్ లో చెప్పారు. ప్రతీ అంశానికి తానే జవాబుదారి అని లెటర్ లో చెప్పారు. 37 ఏళ్ల పాటు ధృఢమైన పట్టుదలతో పనిచేసి తమ కంపెనీల్లో 30వేల ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు. ఒక ప్రైవేట్ ఈక్విటీ పార్ట్ నర్ తనపై ఒత్తిడి తెస్తోందని… దానిని తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరు నెలల క్రితం ఒక స్నేహితుడి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు తెలిపారు. ఇతర రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడి తనను చనిపోయేలా ప్రేరేపిస్తున్నాయన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ DG నుంచి విపరీతమైన ఒత్తిడి ఉందన్నారు. వ్యాపారాలను కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో విజయవంతంగా నడపాలని ఉద్యోగులను కోరారు సిద్ధార్థ. లెటర్ లో ఉన్న అంశాలను బట్టి చూస్తే V G సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

Latest Updates