దళితుడని స్మశానంలో అంత్యక్రియలకు అడ్డుకున్నారు

విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం M.కోటపాడు గ్రామంలో స్మశానం విషయమై ఇరు వర్గాలు గొడవకు దిగాయి. అదే గ్రామానికి చెందిన మాటురి కృష్ణ అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా…అంత్యక్రియల కోసం స్మశానికి తీసుకువెళ్లారు. ఐతే స్మశానంలో దళితులు అంత్యక్రియలు నిర్వహించేందుకు వీల్లేదంటూ స్థానిక రైతులు అడ్డుకున్నారు. దీంతో శవాన్ని స్మశానంలో వదిలిన దళితులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. స్మశానానికి సంబంధించి స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించింది.