ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి బాలిక మృతి

ఖమ్మం జిల్లా : ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి బాలిక మృతి చెందిన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లాలో జరిగింది. చింతకాని మండలం సీతంపేట గ్రామానికి చెందిన బిందు (9) అనే బాలిక తన చెల్లెలుతో కలిసి తాతయ్య వాళ్ల ఇంటి వద్ద ఉంటున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లడంతో.. వారు తాతయ్య, అమ్మమ్మతో కలిసి గ్రామ సమీపంలోని పొలంలో గడ్డి కోసం వెళ్లారు.

తాతయ్య, అమ్మమ్మ గడ్డి కోస్తుండగా.. అక్కాచెల్లెళ్లు చుట్టుపక్కల తిరుగుతూ ప్రమాదవశాత్తు సమీపంలోని నీటి గుంటలో పడి పోయారు. గమనించిన వారి తాతయ్య,  స్థానికులు చిన్న పాపను కాపాడారు. పెద్ద పాప మృతి చెందింది. అస్వస్ధతకు గురైన చిన్న పాపను వెంటనే ఖమ్మంలోని హాస్పిటల్ కు తరలించారు. అప్పటివరకు ఆడుకుంటున్న బాలిక శవమై కనిపించడంతో .. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు బాలిక కుటుంబ సభ్యులు.

Latest Updates