ర‌ష్యా క‌రోనా వ్యాక్సిన్ : ఆ యువ‌తి ఎవ‌రంటే

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ క‌రోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ ను విడుద‌ల చేశారు. విడుద‌ల సంద‌ర్భంగా తొలి వ్యాక్సిన్ త‌న కుమార్తెకు వేయించిన‌ట్లు తెలిపారు. ఆమె ఆరోగ్యం బాగుంద‌ని, వ్యాక్సిన్ వ‌ల్ల ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అయితే అధ్య‌క్షుడికి ఇద్దరు కుమార్తెలు. వారిలో ఎవ‌రికి టీకా వేయించారో చెప్ప‌లేదు.

కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌ష్యా అధ్య‌క్షుడి కుమార్తె ఈమేనంటూ ఓ వీడియో వైర‌ల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ యువ‌తి టీకా వేయించుకుంటున్న విజువ‌ల్స్ క‌న‌బ‌డుతున్నాయి. ఆ వీడియోల‌పై ర‌ష్యా అధికార ప్ర‌తినిధులు స్పందిచారు.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోల్లో క‌నిపిస్తున్న అమ్మాయి అధ్య‌క్షుడి కుమార్తె కాద‌ని తెలిపారు. వైర‌ల్ అవుతున్న వీడియో పాత‌ద‌ని ఆర్టీ కామ్ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

Latest Updates