మార్కెట్లో ఫుల్ డిమాండ్ : వెదురుకు పూర్వ వైభవం

ఏనాడో కళ కోల్పోయిన వెదురు కళాకృతులు ఈ మధ్యే పూర్వ వైభవం దిశగా వెళ్తున్నాయి. కాలానికి తగ్గట్టు… కళకు సాంకేతికతను జోడించి తయారు చేసిన వెదురు ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వెదురుతో గృహాలంకరణ వస్తువులు, ఫర్నీచర్, గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేసేవారు. ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఏకంగా ఇళ్లునే కట్టేశారు. మయూరీ ఎకో పార్క్ లో గెస్ట్ హౌస్ ను పూర్తిగా వెదురుతోనే నిర్మించి… పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు.

ఇనుముకు బదులు వెదురు బద్దలను ఉపయోగించి గెస్ట్ హౌస్ నిర్మించారు. దీనికి బెంగళూరులోని ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ తోడ్పాటు అందించింది. మహబూబ్ నగర్ కు చెందిన కొందరు మేదరులు IPIRTIలో శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ ద్వారా వారికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. ఇనుము, స్టీల్ తో భవనం నిర్మిస్తే అయ్యే ఖర్చులో సగం ధరలోనే వెదురుతో ఇల్లు కట్టారు. వెదురుతో కట్టిన ఇంటితో మంచి లాభాలుంటాయంటున్నారు మేదరులు.

స్టీల్, సిమెంట్ తో కట్టిన దానికన్నా మన్నిక ఎక్కువగా ఉండడం ఒకటైతే… వెదురు ఇంట్లో ఉష్ణోగ్రతలు కనీసం 10 డిగ్రీలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. సంప్రదాయ వృత్తికి సాంకేతికతతోపాటు, ఆధునిక నైపుణ్యాన్ని జోడించటం ద్వారా అద్భుతాలు చేస్తున్నారు మేదరులు. ఈ కళారూపాల తయారీలో మహిళలు, పురుషులు అందరూ తయారు చేస్తూ ఎగ్జిబిషన్ల ద్వారా ఆదాయం పొందుతున్నారు. రాష్ట్రంలోని మిగతా మేదరులకు కూడా ఇలా శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Empty walkway runs through tall bamboo tree garden with sun light

Latest Updates