ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు: షబ్బీర్

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. అయితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. రెండో రోజు ప్రారంభమైన శానన మండలిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ సభ్యులు షబ్బీర్‌ అలీ బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. కేంద్రాన్ని సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు. కాగితాలపై లెక్కలు అలాగే ఉంటున్నాయని, అమల్లో మాత్రం సాధ్యం కావడం లేదన్నారు. అప్పులు భారీగా తెస్తున్నారని, రాష్ట్ర ఆదాయం ఏమవుతోందని ప్రశ్నించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు ఇవ్వట్లేదన్నారు. మూడేళ్ల నుంచి ఎంబీసీలకు రూ.వెయ్యి కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారన్నారు.

Latest Updates