వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది

హైదరాబాద్: ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందన్నారు సీఎం కేసీఆర్. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చిందన్నారు. ఈ నెల 23న కోర్టు విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షాణాధికారం ఎవరికీ లేదని తెలిపారు సీఎం కేసీఆర్.‌

Latest Updates