జాలి పడొద్దు… గీతదాటితే ఏసెయ్యండి : కశ్మీర్ గవర్నర్ ఆదేశాలు

‘జాలి,దయ, కరుణ చూపొద్దు… కశ్మీర్ ను , దేశాన్ని అస్థిరపరిచేందుకు ఎవ్వరు ట్రై చేసినా…. పోలీసులు, భద్రతాబలగాలు ఏం చేయాలో అది చేసేయండి. ఎవరైనా హింసకు దిగినా….. భద్రతాబలగాలు, ఇళ్లపై రాళ్లు రువ్వినా.. గృహాలు, వాహనాలు తగలబెట్టినా.. వదంతులు వ్యాపింపచేసినా… చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా… వారిపై కరుణ చూపించాల్సిన అవసరమే లేదు. కులం.. వర్గం.. మతాలతో సంబంధమేలేదు… ఎవ్వరు ఓవరాక్షన్ చేసినా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి’ అని జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పోలీసులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు.

పుల్వామాలో ఉగ్రదాడి… ఆ తర్వాత జమ్ముకశ్మీర్ లో పరిణామాలపై గవర్నర్ మాలిక్ ఉన్నతస్థాయిలో రివ్యూ చేశారు. భద్రతాబలగాలు, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రెచ్చగొట్టే చర్యలకు ఎవ్వరు పాల్పడినా చూస్తూ ఊరుకోవద్దని ఆదేశాలు జారీచేశారు.

 

Latest Updates