పేరుకి బ్యాంకులే బ్రాంచీలుండవ్

  • సెక్యూర్డ్​ కమ్యూనికేషన్ కోసమే నియో బ్యాంకులకు పెరుగుతున్న ఆదరణ
  • ఎటువంటి బ్రాంచులుండవు..ఖర్చులు తక్కువ
  • మొబైల్‌ ద్వారానే అకౌంట్ ఓపెనింగ్, లోన్లు

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: కొత్త తరం బ్యాంకులు విస్తరిస్తున్నాయ్‌‌‌‌. కరోనా సంక్షోభంతో ‘నియోబ్యాంక్‌‌‌‌’లకు ఆదరణ పెరుగుతోంది.  ట్రెడిషనల్‌‌‌‌ బ్యాంకులు అందించే సర్వీస్‌‌‌‌లను నియో బ్యాంకులు కూడా అందిస్తాయి. కానీ వీటికి ఫిజికల్‌‌‌‌గా బ్రాంచులేమి ఉండవు. కస్టమర్‌‌‌‌‌‌‌‌ తన అకౌంట్‌‌‌‌ను ఒపెన్ చేయాలనుకున్నా, లోన్‌‌‌‌ తీసుకోవాలనుకున్నా అన్ని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే. ప్రస్తుతం ఇండియాలో రేజర్‌‌‌‌‌‌‌‌పేఎక్స్‌‌‌‌, జూపిటర్‌‌‌‌‌‌‌‌, నియో, డిజిబ్యాంక్‌‌‌‌ వంటి నియో బ్యాంకులు బాగా పాపులర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. కానీ రూల్స్ ప్రకారం  ఇవి బ్యాంకింగ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను అందించాలంటే కమర్షియల్‌‌‌‌ బ్యాంకులపై ఆధారపడక తప్పదు. మరోవైపు బ్యాంక్‌‌‌‌లు కూడా డిజిటల్‌‌‌‌ యాప్‌‌‌‌లతో నియోబ్యాంకులకు పోటీ ఇస్తున్నాయి. ఎస్‌‌‌‌బీఐ యోనో, కోటక్‌‌‌‌ 811 లు ఈ తరహా డిజిటల్‌‌‌‌ యాప్‌‌‌‌లకు ఉదాహరణలు.

టెక్నాలజీ పరంగా మెరుగు..

ట్రెడిషనల్‌‌‌‌ బ్యాంకులు ప్రధానంగా బ్యాంక్‌‌‌‌ బ్రాంచులపై ఆధారపడతాయి. వీటిని మెయింటెయిన్‌‌‌‌ చేయడానికి ఉద్యోగులు ఎక్కువగా ఉండాలి. కానీ నియో బ్యాంకులకు ఈ ఖర్చులు తప్పుతాయి. ట్రెడిషనల్ బ్యాంకుల్లానే నియో బ్యాంకులు కూడా అకౌంట్‌‌‌‌ ఓపెనింగ్ నుంచి లోన్లివ్వడం, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అవకాశాలను కల్పించడం వంటి ఫైనాన్షియల్ సర్వీస్‌‌‌‌లను అందిస్తున్నాయి. కస్టమర్‌‌‌‌‌‌‌‌ బ్రాంచులను విజిట్‌‌‌‌ చేయకుండానే ఈ సర్వీస్‌‌‌‌లను ఇస్తున్నాయి. దీంతో ట్రెడిషనల్ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటి టెక్నాలజీ ట్రెడిషనల్ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉంటుంది. యూరప్‌‌‌‌, బ్రెజిల్‌‌‌‌, సౌత్‌‌‌‌ఈస్ట్‌‌‌‌ ఆసియాలలో నియో బ్యాంకులు బాగా విస్తరించాయి. వీటికి లైసెన్స్‌‌‌‌లను డైరెక్ట్‌‌‌‌గా ఈ దేశాల సెంట్రల్‌‌‌‌బ్యాంకులిస్తుండడంతో నియో బ్యాంకులు భారీగా విస్తరిస్తున్నాయి. కానీ ఇండియాలో ఈ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఇక్కడ బ్యాంకింగ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను అందించడానికి ఫిన్‌‌‌‌టెక్ కంపెనీలు ట్రెడిషనల్ బ్యాంకులతో టై అప్ కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రూల్స్‌‌‌‌కు అనుగుణంగా  క్యాష్ రిజర్వ్ రేషియోలను మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. నియో బ్యాంకులకు లైసెన్స్‌‌‌‌లను ఇవ్వడంపై  రెగ్యులేటరీ వేచి చూసే ధోరణిని అనుసరిస్తోందని నిపుణులు అంటున్నారు. దీంతో దేశంలో సక్సెస్ అయిన నియో బ్యాంకుల్లో ట్రెడిషనల్ బ్యాంకుల డిజిటల్ యాప్‌‌‌‌లు ముందుంటున్నాయని పేర్కొన్నారు.

బ్యాంకుల డిజిటల్‌‌‌‌ విభాగాలు అర్బన్‌‌‌‌ కస్టమర్లపై ఎక్కువగా దృష్టిపెడుతుండగా, నియో బ్యాంకులు మాత్రం చిన్న పరిశ్రమలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఎస్‌‌‌‌బీఐ యోనో, కోటక్‌‌‌‌ 811 వంటివి బాగా పాపులరయినా, మెయిన్ బ్యాంక్‌‌‌‌కు కస్టమర్లను యాడ్ చేయడంపైనే ఇవి ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి. ఇప్పటి వరకు  68 లక్షలసేవింగ్‌‌‌‌ అకౌంట్లు యోనో ద్వారా ఓపెన్‌‌‌‌ అయ్యాయని స్టేట్‌‌‌‌ బ్యాంక్ చెబుతోంది. గత ఏడాది కాలంలో కోటక్ బ్యాంక్‌‌‌‌కు యాడ్‌‌‌‌ అయిన కొత్త కస్టమర్లలో మూడో వంతు కస్టమర్లు 811 వలనే యాడ్‌‌‌‌ అయ్యారని కోటక్ బ్యాంక్ పేర్కొంది. మరోవైపు ఫిన్‌‌‌‌టెక్‌‌‌‌ కంపెనీలు ఇన్నొవేటివ్‌‌‌‌ బ్యాంకింగ్ సొల్యూషన్లతో  ఆకర్షిస్తున్నాయి.

బ్యాంకులే పెద్ద అడ్డంకి..

నియో బ్యాంకులకు బ్యాంకుల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను అందించాలంటే ట్రెడిషనల్ బ్యాంకులు, ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలపై ఇవి ఆధారపడక తప్పదు. దీంతో వీటి లాభాలపై ప్రభావం పడుతోంది. కీలకమైన కస్టమర్లకు లోన్‌‌‌‌లివ్వడంపై బ్యాంకుల నుంచి మంచి ఆఫర్లుండడంతో వీరిని కోల్పోతున్నారు. బ్యాంకులు చిన్న కంపెనీల డిజిటల్‌‌‌‌ అవసరాలను  తీర్చగలిగితే నియో బ్యాంకులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నియో బ్యాంకులకు రెగ్యులేటరీ పరమైన కొన్ని అడ్డంకులూ ఉన్నాయి.

ముందు కాలమంతా  నియో బ్యాంక్‌‌‌‌లదేనా?

నియో బ్యాంకులు మరింత విస్తరించేందుకు క్యాపిటల్‌‌‌‌ను సేకరిస్తున్నాయి. జూపిటర్ ఇప్పటి వరకు 26 మిలియన్‌‌‌‌ డాలర్లను వివిధ వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి సేకరించింది. ఎండ్‌‌‌‌ టూ ఎండ్‌‌‌‌ బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌లను ఇవ్వాలని చూస్తున్నామని జూపిటర్ ఫౌండర్ జితేంద్ర గుప్తా అన్నారు. బ్యాంకులు పూర్తిగా డిజిటల్ మోడ్‌‌‌‌లోకి వెళ్లలేవు కాబట్టి దీన్ని అవకాశంగా మార్చుకోవాలని చూస్తున్నామని చెప్పారు. అకౌంట్‌‌‌‌ను చూడగానే ఖర్చులు, సేవింగ్స్‌‌‌‌, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ గోల్స్‌‌‌‌ ఈజీగా కస్టమర్లకు అర్థమయ్యేలా బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌లను తీసుకురావాలని చూస్తున్నామన్నారు. నియో బ్యాంకింగ్‌‌‌‌, లెండింగ్ బిజినెస్‌‌‌‌ను మరింత విస్తరించేందుకు 100 మిలియన్ డాలర్లను సేకరించేందుకు ప్లాన్స్ వేసుకున్నామని రేజర్‌‌‌‌‌‌‌‌పేఎక్స్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ హర్షిల్‌‌‌‌ మథుర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. కంపెనీ డిజిటల్‌‌‌‌ పేమెంట్ గేట్‌‌‌‌వే బిజినెస్‌‌‌‌కు 20 లక్షలకు పైగా చిన్న కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ కరెంట్‌‌‌‌ అకౌంట్లను, కార్డులను, అప్పులను ఇస్తోంది. బెంగళూరు స్టార్టప్‌‌‌‌ కంపెనీ నియో చిన్న కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. బ్లూ కాలర్ వర్కర్లకు జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్లను క్రియేట్‌‌‌‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌‌‌‌పామ్‌‌‌‌కు 11 లక్షల మంది కస్టమర్లున్నారు. డీసీబీ, యెస్‌‌‌‌ బ్యాంకులతో కలిసి బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌లను ఆఫర్ చేస్తోంది. తాజాగా ఐడీఎఫ్‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్‌‌‌‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

– రేజర్‌‌‌‌పేఎక్స్‌‌ ఫౌండర్‌‌‌‌ హర్షిల్‌‌ మాథుర్‌‌‌‌

రిలయన్స్ స్టయిలిష్ డైమండ్ కలెక్షన్

రిలయన్స్ జ్యువెల్స్‌‌‌‌ సరికొత్త ‘డైమండ్ కలెక్షన్‌‌‌‌’తో మార్కెట్లోకి వచ్చింది. స్టయిలిష్‌‌‌‌గా కనపడేలా రిలయన్స్ జ్యువెల్స్‌‌‌‌ డైమండ్ కలెక్షన్ ఉంది. ఈ కొత్త డైమండ్ కలెక్షన్‌‌‌‌లో చెవి రింగులు, ఫింగర్ రింగ్స్, బ్రేస్‌‌‌‌లెట్స్, పెండెంట్స్, నెక్లెస్‌‌‌‌లున్నాయి. అన్ని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్స్‌‌‌‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు. డైమండ్ జ్యువెల్లరీపై 30 శాతం, బంగారు ఆభరణాల తయారీపై 30 శాతం తగ్గింపును పొందవచ్చు.  ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌కు టర్మ్స్ అండ్ కండిషన్లు వర్తిస్తాయి.

Latest Updates