పాకిస్తాన్ లోని ఓ గ్రామం మత సామరస్యాన్ని చాటుతోంది

ఆ ఊళ్లో సిక్కులు లేరు. అయినా అక్కడ గురుద్వారా ఉంది. హిందువులు అక్కడ ప్రేయర్స్ చేస్తే… ముస్లింలు అక్కడికి వచ్చేవారికి అన్ని వసతులు కల్పిస్తున్నారు. ముస్లిం దేశమైన పాకిస్తాన్ లోని ఓ గ్రామం మత సామరస్యాన్ని చాటుతోంది. సింధ్ ప్రావిన్స్ లోని సుక్కుర్ జిల్లాలోని జనోజి గ్రామంలో ఒక్క సిక్కు లేడు. దేశ విభజన తర్వాత అక్కడ ఉన్న గురుద్వారా పాడుబడింది. గురునానక్ 550 జయంతి వేడుకల్లో భాగంగా అక్కడి హిందువులు ఆ గురుద్వారాను బాగు చేయాలని నిర్ణయించారు. 6 లక్షల రూపాయల డొనేషన్లు కలెక్ట్ చేసి గురుద్వారాను రిపేర్ చేయించారు. ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురుద్వారాలో సిక్కుల పవిత్ర గ్రంథమైన  గురు గ్రంథ సాహిబ్ తో పాటు భగవద్గీతను అక్కడ ఉంచి ప్రార్థనలు చేస్తున్నారు.  ముస్లింలు గురుద్వారాకు డొనేషన్లు ఇవ్వడంతోపాటు డెకోరేషన్ బాధ్యతలు తీసుకున్నారు. అక్కడికి వచ్చే భక్తుల కోసం భోజన సదుపాయంతోపాటు ఇతర వసతులను ఏర్పాటు చేశారు.”దేశ విభజన తర్వాత మూతపడిన గురుద్వారాను హిందువులు రీఓపెన్ చేశారు. గురు గ్రంథసాహిబ్ తో పాటు భగవద్గీతను అక్కడ ప్రతిష్టించారు. గురుద్వారాను చూసుకునేందుకు ఒక కేర్ టేకర్ ను కూడా నియమించారు” అని  పాకిస్థాన్ హిందు కౌన్సిల్ మెంబర్ దేవా సికందర్ అన్నారు. సింధ్ ప్రావిన్స్ లో హిందువులు ఎక్కువగా ఉంటారని.. వారంతా నానక్ పంథీ కల్చర్ ను ఫాలో అవుతారని ఆయన చెప్పారు.

Latest Updates