సినీ ఇండస్ర్టీలో వేధింపులు నిజమే: ఆషికి ఫేమ్ అను అగర్వాల్

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా.. ఈ చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. దాన్ని ఎదుర్కోనివారు లేదని అంటున్నా.. ఫేస్ చేసిన వారు మాత్రం కచ్చితంగా ఉంది అంటున్నారు. ‘ఆషికీ’  ఫేమ్ అను అగ ర్వాల్ కూడా ఉంది అనే కుండ బద్దలు కొట్టింది. బాలీవుడ్‌‌లో సంచలనం సృష్టిం చిన లవ్‌స్టోరీస్‌‌లో ‘ఆషికీ’ ఒకటి. ఆ మూవీ మ్యూజిక్ అయితే భాషతో సంబంధం లేకుండా దేశం మొత్తాన్నీ ఊపేసింది. ఆ చిత్రంతోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యింది అను అగర్వాల్. ఓవర్‌ నైట్ స్టార్ అయిపోయింది. కెరీర్‌ మంచి పీక్‌‌లో ఉన్నప్పుడు ఓ ట్రాజిక్ యాక్సిడెంట్ ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసింది. దాదాపు నెల రోజులు కోమాలో ఉండి బైటి కొచ్చింది. గతమంతా మర్చిపోయింది. ముఖం నిండా గాజుముక్కలు గుచ్చుకుపోవడంతో అందమంతా పోయింది. ఎన్నో సర్జరీలు, థెరపీల తర్వాత కోలుకుని, మెల్లమెల్లగా గతం గుర్తుకొచ్చి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంది. త్వరలో ఓ వెబ్‌ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. బిజీగా ఉన్న రోజుల్లో ఓ రోజు మధ్యాహ్నం ఒక డైరెక్టర్ ఆమె ఇంటికొచ్చాడట. కథ డిస్కస్ చేయడానికి వచ్చానంటూ వెంట తెచ్చుకున్న విస్కీ బాటిల్ ఓపెన్ చేశాడట. అతని ప్రవర్తన తేడాగా ఉండటంతో వెంటనే వెళ్లిపోమ్మంటూ మర్యా దగానే హెచ్చరించానని చెప్పింది. ఇండస్ట్రీలో వేధింపులు ఉన్నాయని, ఎదుర్కోవడం నేర్చుకోవాలని, కాంప్రమైజ్ కావడం ఇష్టం లేనివాళ్లు కాస్టింగ్ కౌచ్‌‌కి తలొంచాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

 

Latest Updates