వుహాన్ లో కరోనా : సున్నాకి చేరిన వైరస్ కేసుల సంఖ్య

ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తూ చైనా వుహాన్ నుంచి ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు అక్కడ పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. వుహాన్ లో కరోనాతో బాధపడుతున్న చివరి పేషెంట్ శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో అక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య  సున్నాకి చేరిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సి) ప్రతినిధి మి ఫెంగ్ అన్నారు. దీనంతటికి కారణం 76రోజల లాక్ డౌన్, డాక్టర్లు ,సిబ్బంది సమిష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు.

డిశ్చార్జ్ అయిన 11మంది కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులు

వుహాన్ లో ఇప్పటి వరకు మరణాల కేసులు, కొత్త వైరస్ కేసులు నమోదు కాలేదని.. తాజాగా వైరస్ నుంచి 11 మంది రోగులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వ మీడియా జిన్హువా వెల్లడించింది.

చైనా హుబే ఫ్రావిన్స్ లోని వూహాన్ సిటీలో

చైనాలోని హుబే రాష్ట్రంలోని  ఇప్పటివరకు 68,128మందికి కరోనా సోకింది. వాటిలో 50,333 కేసులు వుహాన్‌ సిటీలో నమోదయ్యాయి.

 

Latest Updates