హాజీపూర్ ఘోరాలపై ముగిసిన విచారణ.. తీర్పు ఈ నెలలోనే

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్య కేసు విచారణ కొలిక్కి వచ్చింది. నలుగురు బాలికల సిరియల్ హత్యలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ పూర్తైంది. బొమ్మలరామారం పోలీసులు హత్యలకు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించటంతో.. రెండు నెలల్లోనే విచారణ పూర్తిచేసింది కోర్టు. ఇప్పటికే హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి.. వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో మూడేళ్లలో నలుగురు బాలికలను దారుణంగా హత్య చేశాడు శ్రీనివాస్ రెడ్డి. బాలికలపై అత్యాచారం చేసి.. హత్య చేశాడు. ఆ తర్వాత పాడుబడ్డ బావిలో వారిని పూడ్చి పెట్టాడు. 2015 ఏప్రిల్ లో మొదటి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత  ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో మరో ఇద్దరు మైనర్లను రేప్ అండ్ మర్డర్ చేశాడు శ్రీనివాస్ రెడ్డి. మేలో మరో బాలికను కూడా ఇదే విధంగా చేయడంతో.. తల్లిదండ్రుల కంప్లైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల కేసును సీరియస్ గా తీసుకున్న రాచకొండ పోలీసులు.. సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ప్రభుత్వం కూడా ఫాస్ట్ ట్రాక్  కోర్టు ఏర్పాటు చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో  600 మందికి పైగా సాక్షులను విచారించినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్, డీఎన్ఏ రిపోర్ట్ లతో పాటు.. అన్ని ఆధారాలతో.. సిట్ బృందం ఫాస్ట్ ట్రాక్  కోర్టులో ఛార్జిషీట్ వేయడంతో విచారణ ముగిసింది. మరో 15 రోజుల్లో శ్రీనివాస్ రెడ్డి శిక్ష ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.

The hearing on the Hajipur incident concluded, judgment on December month end

 

 

Latest Updates