వామ్మో.. ప్రియాంక ఒక్కో పోస్ట్ కాస్ట్ రూ.2 కోట్లు

ప్రియాంక చొప్రా..ఇండియన్ సినిమాకు పరిచయం అక్కర్లేని పేరు. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టింది.  పెళ్లి అయ్యాక ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది. గ్లోబల్ స్టార్ గా ఎదిగి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ప్రియాంకకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో ఇన్ స్ట్రాగ్రమ్ లో అత్యధిక ఫాలోవర్లు కల్గిన వారిలో  వీరాట్ కోహ్లీ తర్వాత రెండవ స్థానంలో ఉంది.  వీరాట్ కోహ్లీ 51.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా..  ప్రియాంక 50.6 మిలియన్ల మంది ఫాలోవర్లను కల్గి ఉంది.

అయితే ఇన్ స్ట్రాగ్రమ్ లో ఫాలోయింగ్ ఉన్న ప్రియాంక చొప్రా పెట్టే పోస్ట్  క్షణాల్లో వైరల్ అవుతోంది. కొందరు వ్యాపార వేత్తలు తమ బిజినెస్ కోసం బ్రాండ్లను ప్రమోట్ చేయిస్తారు. అయితే ఇలా ప్రియాంక   ఒక్కో ఇన్ స్ట్రాగ్రమ్  పోస్ట్ కు  దాదాపు రూ.2 కోట్లు సంపాదిస్తుందని హోపర్‌ హెచ్‌క్యూ సంస్థ వెల్లడించింది. ఇండియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వీరాట్ కోహ్లీ కోటిన్నర సంపాదిస్తాడంట.  ఇన్ స్ట్రాగ్రమ్ ద్వారా అత్యధికంగా సంపాదించే వారిలో  ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రియాంక 19 వ స్థానంలో ఉండగా కోహ్లీ 23వ స్థానంలో ఉన్నాడు.

Latest Updates