కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పిల్.. విచారణకు నిరాకరించిన హైకోర్టు

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై హైకోర్టులో పిల్ ధాఖలైంది. మూడు టీఎంసీల నీటిని పంప్ లైన్ సిస్టం ద్వారా తరలించడాన్ని సవాల్ చేస్తూ టీఎస్ ఇంజినీర్ ఫోరమ్ కన్వీనర్ దొంతుల లక్ష్మీ నారాయణ ఫైల్ చేసిన ఈ పిటిషన్ అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. 3 టీఎంసీల‌ను పంపింగ్ పద్దతి ద్వారా నీటిని తరలిస్తే ప్రభుత్వానికి రూ.8 వేల కోట్ల అదనపు భారం పడుతుందని, ప్రతి ఏటా వేయి కోట్ల రూపాయల మెయింటనెన్స్ ఖర్చు అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు

3టీఎంసీల నీటిని పైప్ లైన్ పద్ధతి ద్వారా తరలిస్తే భూ సేకరణ సమస్య తో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయ‌ని, పాత పద్ధతి ద్వారానే నీటి తరలింపు పనులు చేపట్టాలని పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో cwc( సెంట్రల్ వాటర్ కమిషన్) అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మిచొద్దన్ని ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలిచ్చిందని కోర్టు కు తెలిపారు.

Latest Updates