విద్వేషాలు రెచ్చగొట్టిన కేసులో అక్బరుద్దీన్​కు హైకోర్టు నోటీసు

విద్వేషాలు రెచ్చగొట్టిన కేసులో అక్బరుద్దీన్​కు హైకోర్టు నోటీసు

హైదరాబాద్, వెలుగు: మత విద్వేషాలు, మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని మజ్లిస్‌‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌ ఒవైసీపై దాఖలైన కేసును కింది కోర్టు కొట్టేయడాన్ని సవాల్‌‌ చేస్తూ దాఖలైన అప్పీల్‌‌ పిటిషన్‌‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఒవైసీ, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. విచారణను డిసెంబర్‌‌ 30కి వాయిదా వేస్తూ చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్‌‌ నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్, నిర్మల్‌‌లో ఒవైసీ విద్వేష ప్రసంగాలు చేశారని 2012 డిసెంబర్‌‌లో కేసులు నమోదయ్యాయి.

ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల్ని విచారించే హైదరాబాద్‌‌లోని స్పెషల్‌‌ కోర్టు గత ఏప్రిల్‌‌లో ఆ కేసులను కొట్టివేసింది. ఆ తీర్పును సవాల్‌‌ చేస్తూ అడ్వొకేట్ కె.కరుణసాగర్‌‌ హైకోర్టుకు వెళ్లారు.