సింగిల్ యూజ్ ప్లాస్టిక్​పై హైకోర్టు సీరియస్

  • జీహెచ్ఎంసీ కమిషనర్​కు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో సింగిల్‌‌ యూజ్‌‌ ప్లాస్టిక్‌‌ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెడుతుండడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పర్యావరణానికి నష్టం చేసే నిషేధిత ప్లాస్టిక్​కి ఎలా అనుమతిచ్చారో చెప్పాలని కమిషనర్ లోకేశ్​కుమార్, యాడ్స్‌‌ వింగ్‌‌ అడిషనల్‌‌ కమిషనర్‌‌కు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి డివిజన్‌‌ బెంచ్‌‌ నోటీసులు ఇచ్చింది. రూల్స్​కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌‌ ఏర్పాటు చేస్తున్నారంటూ లాయర్ కేఎస్ సాయికుమార్ ఫైల్ చేసిన పిటిషన్​ను హైకోర్టు శుక్రవారం విచారించింది. అక్రమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ను తొలిగించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీహెచ్ఎంసీకి నోటీసులు ఇచ్చింది. విచారణను వచ్చే నెల ఒకటికి వాయిదా వేసింది.

Latest Updates