సచివాలయ కూల్చివేత ప‌నుల‌ను‌ ఈ నెల 15 వరకు ఆపండి

సచివాలయ భవనాల కూల్చివేత ప‌నుల‌ను ఈ నెల 15 వరకు నిలిపివేయాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని అదేశించింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని దాఖలైన పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ జ‌రిగింది. భవనాల కూల్చివేత అనుమతులపై కౌంటర్ ద్వారా కోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయం షీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు అదేశించింది. ఈరోజు సాయంత్రం సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ధాఖలు చేసిన కౌంటర్‌పై రిప్లై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 15కు హైకోర్టు వాయిదా వేసింది.

Latest Updates