ఇల్లు ఒక్కటే.. రెండు ప్రాపర్టీ బిల్లులు

 ఐదేళ్లుగా కుత్బుల్లాపూర్ ​సర్కిల్ అధికారుల తీరు ఇది

జీడిమెట్ల, వెలుగు: ఇల్లు ఒక్కటే.. కానీ రెండు బిల్లులు. ఇది కుత్బుల్లాపూర్​సర్కిల్ అధికారుల తీరు. దీంతో ఇస్టానుసారంగా ప్రాపర్టీ ట్యాక్స్​లు వేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఇంటికి రెండు వేర్వేరు ట్యాక్స్​లు వేశారు. సూరారం కాలనీకి చెందిన రిటైర్డ్​హెడ్​మాస్టర్​ఈశ్వరయ్యకు అదేకాలనీలో  ప్రాపర్టీ ఉంది.   5 ఐదేళ్లుగా అతనికి రెండు విధాలుగా ప్రాపర్టీ ట్యాక్స్​విధిస్తున్నారు. ఒకటి కమర్షియల్, మరొకటి  రెసిడెన్షియల్.​ దీనిపై ఆయన, కుమారులు కుత్బుల్లాపూర్​ సర్కిల్​ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదు.  దీంతో  ఆదివారం నిర్వహించిన ప్రాపర్టీ ట్యాక్స్​ పరిష్కార వేదికలో కంప్లయింట్​ చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరారు.

 

Latest Updates