భర్త అతని అన్నయ్య లైంగికంగా వేధిస్తున్నారు…

పెళ్లైన నాలుగు నెలలకే ఓ మహిళకు నరకం చూపెట్టారు అత్తింటి వారు. కట్టుకున్న భర్త,అతడి అన్న, అత్త, మామా అందరూ కలిసి ఆ మహిళను  చిత్రహింసలు  పెట్టారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ.  ఈ ఘటన గుజరాత్ లో జరిగింది.

గుజరాత్ లోని భావ్ నగర్ లో ఓ యువతికి నాలుగు నెలల క్రితం పెళ్లి అయింది. పెళ్లై నాలుగు నెలలయ్యాక అత్తింటి వారి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. అదనపు కట్నం కోసం అత్తమామలు, లైంగిక కోరికలు తీర్చమని భర్త.. అతని అన్నయ్య వేధించడం మొదలు పెట్టారు. ఇలా రోజు వాళ్ల వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. తన భర్తకు విచిత్రమైన కోరికలు ఉన్నాయని.. అందులో భాగంగానే బాత్ రూమ్ లో సెక్స్ చేయాలని పట్టుపడితే తాను ఒప్పుకోకపోవడంతో కొట్టాడని అన్నది. అలాగే తన భర్త, అతని అన్నయ్య లైంగిక కోరికలు తీర్చాలంటూ రోజు వేధిస్తున్నారని.. అత్త, మామ అదనపు కట్నం కోసం ఇంటి నుంచి గెంటేశారని ఆ మహిళ ఫిర్యాదులో తెలిపింది.శారీరకంగా మానసికంగా వేదిస్తున్న తన అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులు వాళ్లపై కేసు నమోదు చేశారు.

Latest Updates