
చదువు మధ్యలో ఆపేస్తే కోర్సు పూర్తి ఫీజు కట్టాలన్న కాలేజీకి రూ.15 వేల జరిమానా విధించింది హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ . హిమాయత్ నగర్ లోని మదీనా మహిళా డిగ్రీ కాలేజీలో చదువుతున్న జాహ్నవి అనే ఓ విద్యార్థిని 2017-18 బీఎస్సీలో చేరింది. ఫస్ట్ ఇయర్ పూర్తయ్యాక బీపీటీ కోర్సుకు అర్హత సాధించడంతో తన సర్టిఫికెట్స్ ఇవ్వమని కాలేజ్ యాజమన్యాన్ని కోరింది. బీఎస్సీ సెకండ్ ఇయర్ కోర్స్ ఫీజు మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పడంతో ఆ విద్యార్థిని పూర్తి ఫీజు చెల్లించింది.
అయితే ఫీజు మొత్తం వసూలు చేయడంపై విద్యార్థిని జాహ్నవి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కేంద్రానికి కంప్లైయింట్ చేసింది. కట్టిన ఫీజుకి పే స్లిప్ కూడా ఇవ్వలేదని కాలేజ్ పై కంప్లైంట్ ఇచ్చింది. యూజీసీ, ఏఐసీటీఈ, వంటి పలు వర్శిటీలు జారీ చేసిన నిబంధనలను పరిశీలించిన జిల్లా కమిషన్ మదీనా కాలేజ్ పై సీరియస్ అయ్యారు. అసలు విద్యార్థుల సర్టిఫికెట్స్ కాలేజీలు తమ వద్దే పెట్టుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. విద్యార్థిని కట్టిన ఫీజుతో పాటు అదనంగా మరో రూ.10 వేలు, కేసు ఖర్చుల రూ. 5 వేలు చెల్లించాలని కాలేజీని ఆదేశించింది.
see more news