సవరణల పేరుతో స.హ. చట్టం రద్దు చేసేందుకు కుట్ర: పొన్నం ప్రభాకర్

స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని మోడీ ప్రభుత్వం ర‌ద్దు చేయాల‌నే ఆలోచ‌న‌ల‌తో ఉంద‌ని టిపిసిసి కార్య నిర్వాహ‌క అధ్య‌క్షులు పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని స‌వ‌ర‌ణ‌లు చేయాలనే పేరుతో నెమ్మ‌దిగా చ‌ట్టాన్ని ర‌ద్దు చేసే దిశ‌గా పావులు క‌దుపుతుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు పాల‌నా వ్య‌వ‌హారాలు తెలియ‌కుండా మోడీ ప్రభుత్వం  చేసే కుట్ర‌ ఇదని అన్నారు.

2005లో యూపీఏ మొద‌టి ప్ర‌భుత్వం ఒక పార‌ద‌ర్శ‌క పాల‌న అందించేందుకు,  పాల‌కుల‌లో జ‌వాబుదారి త‌నాన్ని పెంచేందుకు ఈ స‌మాచార హ‌క్కు చట్టాన్ని ప్రవేశ పెట్టిందని పొన్నం అన్నారు. ఈ చ‌ట్టం వ‌ల్లనే న‌రేంద్ర‌ మోడీ, స్మ్ర‌తి ఇరానీ లాంటి నేత‌ల విద్యార్హ‌త‌ల గురించి ప్ర‌జ‌లు తెలుసుకున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇలాంటి మ‌రిన్ని లొసుగులు బ‌య‌ట‌ప‌డుతాయ‌నే భ‌యంతోనే మోడీ ప్ర‌భుత్వం ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, దేశంలో మేధావులు, విద్యావంతులు, ప్ర‌జాస్వామిక వాదులు వెంట‌నే మోడీ దుందుడుకు చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని ఆయ‌న అన్నారు.

Latest Updates