పనిలేని మనిషి

ఈ లోకంలో అన్నిం టికంటే కష్టమైన పనేంది? అంటే ఒక్కొ క్కరూ ఒక్కోటి చెప్పొచ్చు. కానీ, ఏ పనీ చేయకుండా ఉండటమే అన్నిం టికంటే కష్టం అంటే దాదాపు ఒప్పుకోని వాళ్లు ఉండరు.కాదనేవాళ్లు.. కావాలంటే ఏం చేయకుండా, కాళ్లు చేతులు ఆడించకుండా, కళ్లు మూయకుండా ఒక గంటసేపు అట్ల కూర్చొని చూడండి తెలుస్తుంది. ఆ పని ఎంత కష్టమైనదో! ఓ ఇండోనేషియన్‌ యూట్యూబర్ ముహమ్మద్‌ రెండు గంటల సేపు ఈ కష్టమైన పని చేసి.. వీడియో రికార్డు చేసిండు. ఏం చేయకుండా కెమెరా ముందు అట్ల మంచం మీద కూర్చున్న రెండు గంటల వీడియో యూట్యూబ్‌ లో అప్‌ లోడ్ చేసిండు. జూలై ఫస్ట్‌‌‌‌వీక్‌ లో అప్‌ లోడ్ చేసిన ఈ వీడియోను పదిహేను లక్షల మంది చూశారు.

అంతేకాదు, ఇతని మీద ఎన్నో మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. వాస్తవానికి ఇది వైరల్ అయ్యే వీడియో కానే కాదు. కానీ, అతడ్ని ఇమిటేట్‌ చేస్తూ సెలబ్రెటీలు కూడా అలాంటి వీడియోలు చేసి పోస్ట్ చేయడం మొదలు పెట్టా రు. దాంతో ఇతగాడి వీడియో వైరల్‌ అయిపోయిం ది. ముహమ్మద్‌ సక్సెస్‌ ను కాపీ చేసి.. ఇంకొంతమంది రెండు గంటలు కాదు మేం మూడు , నాలుగు, చివరికి ఎనిమిది గంటలు కూడా ఉంటామని వీడియోలు తీసి యూ ట్యూబ్‌ లో పోస్ట్‌‌‌‌ చేస్తున్నారు. కానీ, ఈ పిచ్చి ముదిరిందనుకు న్నారో…ఏమోగానీ వాళ్లకు ఇన్ని వ్యూస్ రావట్లేదు. పాపం..!

 

Latest Updates