ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల అభిశంసన

  • ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సంచలన ఉత్తర్వులు

అమరావతి: ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను అభిశంసిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సంచలన రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌లను ఎందుకు అభిశంసించాల్సి వచ్చిందో ఉత్తర్వుల్లో క్లుప్తంగా తెలియజేశారు. 2021 ఓటర్ల జాబితా ప్రకటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని..  వీరి నిర్లక్ష్యం కారణంగా 2019 ఓటర్ల జాబితా ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందన్నారు. ఓటర్ల జాబితా ప్రకటిస్తామని కోర్టుకు చెప్పి కూడా ఆ విధులు నిర్వర్తించలేదని.. దీని వల్ల దాదాపు 3.61 లక్షల మంది కొత్త యువ ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకోలేకపోతున్నారని వివరించారు. ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు విధి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని.. ఇది క్షమించి వదలేయడానికి వీలులేని విషయమని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే ఎన్నికల కమిషన్ కు ఉన్న స్వేచ్ఛను నీరుగార్చేయత్నమేనని.. అభిశంసన ఉత్తర్వులను వీరి సర్వీసు రికార్డుల్లో కూడా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శితోపాటు.. సంబంధిత అధికారులకు పంపారు.

ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు యధాతథంగా..

Censure Procgs on Panchayat Raj officials

Latest Updates