ఫేస్ బుక్ అడ్డాగా కిడ్నీ రాకెట్

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు రూ.50 లక్షల నుంచి కోటి ఖర్చు చేసే సంపన్నులను సెలెక్ట్ చేసుకోవడం.. లక్షలరూపాయలు ఎరవేసి డోనర్లను పట్టడం.. మెడికల్ఎమర్జెన్సీ పేరిట శ్రీలంక, ఈజిప్ట్, టర్కీ తీసుకెళ్లి కిడ్నీఆపరేషన్లు చేయించడం.. ఇలా ఇప్పటి వరకూ 40మందికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసిన కిడ్నీ రాకెట్​ గుట్టును రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టుచేశారు. అవయవదానం పేరుతో ఫేస్ బుక్ అడ్డాగా దందా సాగిస్తున్న ఈ గ్యాంగ్​ ప్రధాన నిందితునితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్​ చేశారు. ల్యాప్ టాప్‌‌, మొబైల్ పోన్స్, లేజర్ ప్రింటర్స్, స్కానర్స్,  డెబిట్ కార్డ్స్, పాస్ పోర్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్, ఇన్ స్పెక్టర్ నరేందర్ గౌడ్‌‌తో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు.

ఫేస్‌‌బుక్‌‌లో ట్రాప్‌ చేసి..
ఎల్బీనగర్ కు చెందిన రాజు(36)కు భార్య, ఇద్దరు పిల్లలు. ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు. వచ్చే జీతంతో కుటుంబ పోషణ భారం కావడంతో వేరే జాబ్ కోసం ఫేస్ బుక్ లో సెర్చ్ చేశాడు. రోహన్ మాలిక్ అనే పేరుతో ఉన్న ‘Kidney needed in India’ అనే పోస్టింగ్ చూశాడు. సందీప్ కుమార్(30)అలియాస్ రోహన్ మాలిక్ కు వాట్సాప్‌‌ కాల్ చేసి కిడ్నీదానం వివరాలు తెలుసుకున్నాడు. రోహన్ చెప్పినట్లుగా www.sosims.com అనే సైట్ ద్వారా తనవివరాలు నమోదు చేశాడు. ఒకరోజు రాజుకు రోహన్ వాట్సాప్ కాల్ చేసి అత్యవసరంగా కిడ్నీ కావాలని.. ఇస్తే రూ.20 లక్షలు ఇస్తామని చెప్పడంతో రాజు ఓకేచెప్పాడు. గతేడాది జూలై 20న ఢిల్లీ నోయిడాలోని రాడిసన్ హోటల్లో రాజుకు 7 రోజులపాటు మెడికల్ టెస్ట్​లు చేశారు. అతడి ఒరిజినల్ పాస్ పోర్ట్ తీసుకుని హైదరాబాద్ పంపేశాడు.

కిడ్నీ క్రాస్ చెక్ కోసం జూలై 31న రాజును మళ్లీ ఢిల్లీ రమ్మన్నారు. అక్కడే ఆపరేషన్ కోసం టర్కీ వెళ్లేందుకు డాక్యుమెంట్స్ రెడీ చేయించారు. ఆగస్టు 11న మెడికల్ ఎమర్జెన్సీకింద రాజుకు వీసా రెడీ చేశారు. 13న నోయిడాలోని హోటల్ లెమన్ ట్రీకి రాజును తీసుకెళ్లిన రోహన్​ కిడ్నీఅవసరమైన వ్యక్తి గగన్ అగర్వాల్ ను పరిచయం చేసి రితికా జైశ్వాల్ అనే యువతిని డాక్టర్ గా చెప్పారు. ఆమెతో ఆపరేషన్ కు కావలసిన డాక్యుమెంట్లను పూర్తిచేశారు. టర్కీ కెంట్ ఇజ్మీర్ ఆస్పత్రిలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు ఏర్పాట్లు చేశారు. డాక్టర్ అంబ్రిష్,  దిన..రాజుకు టెస్ట్​లు చేసి ఆగస్ట్ 27న అతడి కిడ్నీ తీసి గగన్ అగర్వాల్ కు అమర్చారు.

చంపేస్తామని బెదిరింపులు
గగన్ కు కిడ్నీ అమర్చిన తర్వాత రోహన్, రితికాఅలియాస్ రింకి(37) అసలు రంగు బయటపడింది. ఇస్తానన్న రూ.20 లక్షలకు ఇవ్వకపోగా చంపేస్తామని బెదిరించారు. భయంతో డబ్బుఇవ్వకపోయినా పర్లేదు ఇండియాకు పంపాలని కోరగా.. ఆరోగ్యం మెరుగుపడిన వారం తర్వాత ఇండియాకు పంపారు. దీనిపై ఫిబ్రవరి 5నరాచకొండ సీపీ మహేష్ భగవత్ కు రాజు ఫిర్యా దు చేశాడు. రంగంలోకి దిగిన రాజు ఇచ్చిన వాట్సప్ నంబర్ ఆధారంగా రోహన్, రింకిలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన అమ్రిష్ తాప్(33) ఈ ముఠా ప్రధాన సూత్రధారిగాగుర్తించారు.

మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ దందా చేస్తున్నట్లు తేల్చారు. ఇందుకు డాక్టర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఏజెంట్స్ , బ్రోకర్లతోపాటు ప్రభుత్వఅధికారులను గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. శ్రీలంకలోని ఆల్ ఫహద్, ఈజిప్ట్ లోని కరియో, టర్కీలోని కెంట్ ఇజ్మీర్ ఆస్పత్రుల్లో 40 వరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు. అమ్రిష్ ప్రతాప్ ను గత వారం ఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ రాకెట్ వెనుక ఉన్న డాక్టర్లు, ఏజెంట్ల వివరాలతోపాటు ఎంత మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్చేశారో రాబడతామని సీపీ తెలిపారు.

Latest Updates