పార్లమెంట్ ను తాకిన ‘దిశ‘ ఘటన..31లోపు ఉరితీయాలి

వెటర్నరీ డాక్టర్ దిశ ఘటన  పార్లమెంట్ ను తాకింది. రాజ్యసభలో దిశా ఘటనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్.. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై దారుణాలు ఆగడం లేదన్నారు . నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టాలు మార్చాల్సిన అవసరముందన్నారు.

దిశ లాంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులను వెంటనే శిక్షించాలన్నారు కాంగ్రెస్ నేత సుబ్బిరామిరెడ్డి. వెంటనే శిక్షిస్తే ఇలాంటి ఘటనలు జరగవన్నారు. దిశ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందన్నారు ఎంపీ జయాబచ్చన్. ఇలాంటి ఘటనలపై  ప్రజలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.

పిల్లలకు ,మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందన్నారు అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్ .నేరానికి పాల్పడిన నలుగురిని  డిసెంబర్ 31 లోపు ఉరితీయాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా న్యాయం జరిగేలా చూడాలన్నారు.

కేవలం చట్టాలు చేయడం వల్లే న్యాయం జరగదన్నారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. చట్టాల్లో మార్పురావాల్సిన అవసరముందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు.

Latest Updates