జెండా ఎగరకుండానే జనగణమన

పబ్లిక్‌ గార్డెన్‌ లో నిర్వహించిన రిపబ్లిక్​ డే వేడుకల్లో గవర్నర్‌‌ ఎగురవేసిన జెండా తెరుచుకోలేదు. ఆమె పలుసార్లు రోప్‌ లాగినా జెండా ముడి వీడలేదు. జెండా అలా ఉండగానే పోలీస్‌ బ్యాండ్‌ ట్రూప్‌ జనగణమన మ్యూజిక్‌ స్టార్ట్‌‌ చేసింది. జాతీయ గీతం తర్వాత ప్రొటొకాల్‌ ఆఫీసర్లు జెండాను కిందికి దించి సరి చేసి మళ్లీ ఎగరేశారు. ప్రొటొకాల్‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పొరపాట్లు జరిగినట్టుగా అక్కడి వారు చర్చించుకున్నారు.

కేసీఆర్‌ , కేటీఆర్‌ ను కలిసిన అసద్

గవర్నర్‌‌ ప్రసంగం ముగిసే సమయంలో పబ్లిక్​గార్డెన్​కు వచ్చిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ మంత్రి కేటీఆర్‌‌తో కాసేపు చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లగా.. అప్పుడే గవర్నర్‌‌ ప్రసంగం ముగిసింది. ఆమె రాజ్‌ భవన్‌ కు బయల్దేరుతుండగా సీఎంతో మాట్లాడుతూ అసద్‌‌ ముందుకుసాగారు.

see also: పాల సేకరణ ధర రూ.2 పెరిగింది

see also: ఈరోజే చైర్‌‌ పర్సన్లు, మేయర్ల ఎన్నిక

see also: ‘హంగ్​’లలో ఎక్కువ టీఆర్​ఎస్​ చేతికి?

Latest Updates