కర్నాటక బ్యాంక్‌‌కు రూ.285 కోట్లు టోకరా

న్యూఢిల్లీ : నాలుగు లోన్ అకౌంట్లలో రూ.285 కోట్ల మోసం జరిగిందని కర్నాటక బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐకి రిపోర్ట్ చేసింది. ఈ నాలుగు లోన్ అకౌంట్లలో డీహెచ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్(దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్), రెలిగేర్ ఫిన్‌‌‌‌‌‌‌‌వెస్ట్, ఫెడ్డర్స్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, లీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఉన్నట్టు బ్యాంక్ చెప్పింది. వీటికి  2009 నుంచి 2014 మధ్య లోన్లు ఇచ్చిన కన్సార్షియం లెండర్లలో తమ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్నట్టు పేర్కొంది. డీహెచ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ గరిష్టంగా రూ.180.13 కోట్లను, రెలిగేర్ ఇన్‌‌‌‌‌‌‌‌వెస్ట్ రూ.43.44 కోట్లను, ఫెడ్డర్స్ ఎలక్ట్రిక్ రూ.41.30 కోట్లను, లీ ఎలక్ట్రికల్స్‌‌‌‌‌‌‌‌ రూ.20.65 కోట్లను బాకీ పడిందని చెప్పింది. కన్సార్షియం అరేంజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కింద పలు క్రెడిట్ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌ను డీహెచ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్ పొందిందని పేర్కొంది. ఈ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌ అందించిన బ్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో తాము కూడా మెంబర్ అని చెప్పింది. 2019 నవంబర్ 11న ఈ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో మోసం జరిగినట్టు వెల్లడైందని తెలిసింది.

2019 అక్టోబర్ 30న ఈ అకౌంట్‌‌‌‌‌‌‌‌ను నాన్‌‌‌‌‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మింగ్ అసెట్‌‌‌‌‌‌‌‌గా పరిగణించినట్టు కర్నాటక బ్యాంక్ పేర్కొంది. క్రెడిట్ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌ను పెంచుకుని ఇది ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను దారిమళ్లించిందని, దుర్వినియోగానికి పాల్పడిందని కర్నాటక బ్యాంక్ తెలిపింది. డీహెచ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్ మోసం విలువ రూ.180.13 కోట్లుగా ఉన్నట్టు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐకి రిపోర్ట్ చేసింది. అలాగే 2014 నుంచి బ్యాంక్‌‌‌‌‌‌‌‌తో డీల్ చేస్తోన్న రెలిగేర్ ఫిన్‌‌‌‌‌‌‌‌వెస్ట్ లిమిటెడ్ కూడా పలు క్రెడిట్ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌ను పొందిందని చెప్పింది. ఈ అకౌంట్‌‌‌‌‌‌‌‌ను 2019 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే నాన్ పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మింగ్ కింద క్లాసిఫై చేశామని, ఈ కంపెనీ కూడా రూ.43.44 కోట్ల మోసానికి పాల్పడినట్టు తెలిపింది.  లీ ఎలక్ట్రికల్స్ కూడా 2019 మార్చిలో ఎన్‌‌‌‌‌‌‌‌పీఏగా మారిందని తెలిపింది. ఫెడ్డర్స్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ 2018 జూలైలో ఎన్‌‌‌‌‌‌‌‌పీఏగా మారినట్టు వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్

Latest Updates