కిడ్నాపర్ ఆచూకీ తెలిపితే రూ.లక్ష ప్రైజ్ మనీ

యువతి కిడ్నాప్ కేసులో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన హయత్ నగర్  పోలీసులు

ఎల్ బీ నగర్, వెలుగు : బీ ఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసులో  హయత్ నగర్  పోలీసులు ఆదివారం లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు. కిడ్నాపర్ ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష  ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడకు చెందిన రవిశంకర్ ఈ నెల 23న సోనిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాపర్ కోసం ఎనిమిది  టీమ్స్ గాలిస్తున్నాయి. వారం గడుస్తున్నా యువతి ఆచూకీ దొరక్కపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

కిడ్నాపర్  కర్ణాటకలో దొంగిలించిన ఐ–20 కారుకి ఎపీ39ఏ‌క్యూ1686  ఫేక్ నంబర్ ప్లేట్ పెట్టి కిడ్నాప్ కోసం వాడినట్టు పోలీసులు గుర్తించారు.  అతడిని గుర్తించిన వారు హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ నం.9490607161 కు గాని లేదా 9494721100, 9490617111 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని వారు కోరారు.

Latest Updates