ముంబై ‘కింగ్స్’ సరికొత్త హిస్టరీ : అమెరికన్ డాన్స్ షో విన్నర్

  • వరల్డ్ ఆఫ్ డాన్స్ హిస్టరీలో సరికొత్త మైలురాయి
  • మొట్టమొదటిసారి అమెరికా డాన్స్ షోలో ఇండియన్ టీమ్ విజేత
  • ఇండియన్ థీమ్, సాంగ్స్ తో సత్తా చాటిన ముంబై ‘కింగ్స్ టీమ్’
  • 1 మిలియన్ డాలర్ ప్రైజ్ మనీ గెల్చుకున్న కుర్రాళ్లు

మన ఇండియన్స్.. అమెరికాలో సత్తా చాటారు. రచ్చ గెలిచి.. దేశానికి గర్వకారణంగా నిలిచారు. కాలిఫోర్నియా వేదికగా జరిగే… ప్రఖ్యాత అమెరికన్ టీవీ రియాలిటీ షో “వరల్డ్ ఆఫ్ డాన్స్” సీజన్ 3 టైటిల్ ను ముంబైకి చెందిన డాన్స్ టీమ్ ‘ది కింగ్స్’ గెల్చుకుంది. ప్రైజ్ మనీ కింద 1 మిలియన్ డాలర్స్ అంటే.. దాదాపు రూ.7కోట్లు విన్నయ్యారు.

ఫైనల్ ఉత్కంఠగా జరిగింది. 3 టీమ్స్ కు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేశారు సూపర్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్, డాన్సింగ్ స్టార్స్ డెరిక్ హఫ్, నే-యో. టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ తో స్టేజీని హోరెత్తించారంటూ… ముంబైకి చెందిన డాన్సింగ్ క్రూ ముకుంద్ అండ్ టీమ్ ను విజేతగా ప్రకటించింది జడ్జెస్ టీమ్. కళ్లు చెదిరే పెర్ఫామెన్స్ తో అలరించారంటూ మెచ్చుకున్నారు.

ఇండియన్ మ్యూజిక్ లో ఉన్న మ్యాజిక్ ఏంటో మరోసారి వరల్డ్ ఆఫ్ డాన్స్ వేదికపైనుంచి ప్రపంచానికి చూపించింది కింగ్స్ టీమ్. బాలీవుడ్, టాలీవుడ్ పాటలకే స్టెప్పులేశారు ముంబై కింగ్స్ టీమ్ డాన్సర్లు. షో గ్రాండ్ ఫైనల్లో… సర్దార్ గబ్బర్ లోని వాడెవడైనా.. వీడెవడైనా… థీమ్ సాంగ్ కు అద్దిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ స్టెప్పులకు జడ్జెస్ టీమ్ ఫిదా అయిపోయింది.

ముంబై కింగ్స్ టీమ్ ఇప్పటికే మన ఇండియాలో చాలా ఫేమస్. రెండేళ్ల కిందట బాహుబలి పెర్ఫామెన్స్ తో ఇరగదీశారు ఈ కుర్రాళ్లు. సినిమాటిక్ ఫీల్ ఇస్తూ.. డాన్స్ చేస్తే.. దుమ్ములేపొచ్చని డిసైడయ్యారు. ఈ ట్రిక్ ను ప్రపంచ డాన్సింగ్ వేదికపై ప్రదర్శించాలనుకున్నారు. అలా వరల్డ్ ఫేమస్ అయిన.. వరల్డ్ ఆఫ్ డాన్స్ ను సెలెక్ట్ చేసుకుని.. కష్టపడ్డారు. స్పార్టన్ స్టైల్లో బాహుబలి గెటప్స్ తో… సర్దార్ గబ్బర్ సింగ్ పాటను డిజైన్ చేసి.. సరికొత్త థీమ్ తో ఫైనల్లో పెర్ఫామ్ చేశారు.

పదేళ్లుగా కష్టానికి ఫలితం ఇది : టీమ్

కింగ్స్ టీమ్ ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఈ రియాలిటీ షోతో కలలన్నీ నిజం అయ్యాయి. ఇండియన్ డాన్స్  పవర్ ప్రపంచానికి చూపించాం. మేమంతా చాలా కష్టపడ్డాం. దాదాపు 10 సంవత్సరాలుగా డాన్స్ ప్రాక్టీస్ చేశాం. ఫిట్ నెస్ కాపాడుకుంటూ.. గాయాలు ఓర్చుకుంటూ సాధన చేశాం. ఓ టీమ్ గా పనిచేసి ప్రపంచంలోనే టాప్ డాన్సర్స్ అనిపించుకున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది” అన్నారు. కింగ్స్ టీమ్ మెంబర్స్.

View this post on Instagram

It’s time to spread the word. Tag your FRIENDS /DANCER in the comments below and let them know #TheKings from India have made our nation proud by being the very first team from 🇮🇳 to become the World Champions. Let us make this reach to each and every citizen of our country. . . . Perfect Victory for India 🇮🇳 by Scoring a Perfect Score 💯 .. (1) first INDIAN 🇮🇳 team to win world finals with a perfect score 💯❗️ (2) first team to receive shoes from Jennifer Lopez and derekhough as a sign of respect🙌🏻 (3) first team to receive standing ovation in all the rounds. 4) first team to continuously score the highest points and lead the scoreboard in all the rounds We can proudly say that We Are THE KINGS we are the WORLD CHAMPIONS ! 🏆⚔️🦁 . . #thekingswod #kingsunited #thisiswod #gokingsgoindia #worldofdance #wod #wod3 #worldofdance3

A post shared by The Kings (@kings_united_india) on

 

Latest Updates