సమ్మె వద్దు.. మాట్లాడుకుందాం

కార్మిక సంఘాలకు ఆర్టీసీ నోటీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: సమ్మె తప్పదంటూ నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ యూనియన్లకు కార్మిక శాఖ కన్సిలియేషన్(రాజీ) నోటీస్​ పంపింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని సూచించింది. ఈమేరకు బుధవారం కార్మిక శాఖ జాయింట్​ కమిషనర్ ​గంగాధర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై యూనియన్​ నేతలు స్పందిస్తూ.. ఈ చర్చలతో ఎలాంటి ఉపయోగమూ ఉండదని తేల్చిచెప్పారు.  విద్యుత్‌‌ బస్సుల టెండర్లను ఆపేయాలని డిమాండ్‌‌ చేస్తూ ఈ నెల 21న  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు ఎంప్లాయీస్‌‌ యూనియన్‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తెలిపారు. విద్యుత్​ బస్సుల నిర్వహణ ఆర్టీసీ చేతుల్లోనే ఉండాలని, రాయితీలు కూడా ఆర్టీసీకే ఇవ్వాలని, లేదంటే టెండర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు.

The Labor Department sent Consolidation Notices to RTC unions.

Latest Updates