ముగిసిన ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు

న్యూఢిల్లీ :  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సాంప్రదాయ పద్దతిలో అత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ప్రణబ్ పార్ధివ దేహం వద్ద కరోనా రూల్స్ పాటిస్తూ సర్వమత ప్రార్ధనలు జరిపారు. అశ్రున‌య‌నాల మ‌ధ్య దాదాకు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌ణ‌బ్ అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు.

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆగ‌స్టు 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్ప్ర‌తిలో ప్ర‌ణ‌బ్ చేరిన విష‌యం తెలిసిదే.  మెద‌డులో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డంతో ఆయ‌న‌కు ఆర్మీ హాస్పిటల్ డాక్టర్లు స‌ర్జరీ చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌ణ‌బ్ ‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ క్ర‌మంలో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆగ‌స్టు 31న సాయంత్రం ప్ర‌ణ‌బ్ తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం ప్రణబ్ ముఖర్జీ పార్ధివ దేహానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు కరోనా రూల్స్ పాటిస్తూ నివాళులు అర్పించారు.

Latest Updates