లెక్చరర్లకు పోరాటం తప్ప మరో దారి లేదు

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లెక్చరర్లు, టీచర్ల  పరిస్థితి అధ్వాన్నంగా ఉందని తెలంగాణ లెక్చరర్ల ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లెక్చరర్లకు పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లెక్చరర్ల రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి కత్తి వెంకటస్వామి హాజరై మాట్లాడారు. ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్‌‌లో పనిచేస్తున్న లెక్చరర్లు, టీచర్లకు న్యాయం చేయాల్సిన రాష్ట్ర సర్కారు స్పందించడంలేదని మండిపడ్డారు. గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

 

 

Latest Updates