మానుకోట టూ ఎర్రకోటకు.. మోడీతో మాట్లాడేది ఈ మహిళనే..

మానుకోట మహిళకు గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి గిరిజన మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది మహబూబాబాద్  జిల్లా గడ్డిగూడెంకు చెందిన భూక్యా లక్ష్మి. స్వయం ఉపాధి పొందేలా మహిళల్లో చైతన్యం నింపింది. లక్ష్మి చేసిన సేవకు గుర్తుగా… 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశంతో పాటు ప్రధాని మోడీతో మాట్లాడే చాన్స్  దొరికింది. 15 ఏండ్లుగా తండాలోని మహిళలకు అక్షర జ్ణానం కల్పించడంతో పాటుగా స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తోంది లక్ష్మి.

పోదుపు సంఘాలను ఏర్పాటు చేసి అందరు అర్ధికంగా ఎదుగుదలకు కృషి చేసింది. అమె మహిళలల్లో అర్ధికంగా ఎదుగుదలకు పాటు పడుతునే తనలా తన పిల్లలుండకుండా తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకుంటుంది. ఇద్దరు పిల్లలను హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివిస్తుంది. తనకు డిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని అంటుంది లక్ష్మి.

see more news

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు

వెయ్యి రూపాయలుంటే విమానం ఎక్కొచ్చు

వామ్మో.. పాఠశాలకు రూ.6 కోట్ల కరెంట్ బిల్లు!

 

 

 

Latest Updates