నలుగుర్ని చంపి పరారైన నిందితుడు ఆత్మహత్య

భార్య, పిల్లలపై పెయింట్ లో కలపే టిన్నర్ పోసి హతమార్చిన నిందితుడు లక్ష్మీరాజ్యం (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నెమలి కొండ గ్రామానికి చెందిన లక్ష్మీ రాజ్యం.. నవంబర్ 21 న కుటుంబ కలహాల కారణంగా కుటుంబసభ్యులపై టిన్నర్ పోసి నిప్పంటించాడు. సిద్ధిపేట జిల్లా ఖమ్మం పల్లిలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మీరాజ్యం భార్య విమల, కూతురు పవిత్ర , బామ్మర్ది భార్య రాజేశ్వరి, వదిన సునీత మృతి చెందారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. కాగా ఆదివారం అతడి స్వగ్రామం సమీపంలోని కొండగట్టు వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

The man accused of killing four persons committed suicide at Kondagattu

Latest Updates