సర్పంచ్‌ చెప్పుతో కొట్టాడని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

జనగామ జిల్లా:  సర్పంచ్ చెప్పుతో కొట్టాడని మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం జనగామ జిల్లాలో జరిగింది. రఘునాథపల్లి మండలం కుసుమ భాయ్ తండాలో చిన్న విషయంపై మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఘర్షణలో భాగంగా ఎల్లేష్పు అనే వ్యక్తిని సర్పంచి రమేష్ చెప్పుతో కొట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎల్లేష్పు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తప్పులేకున్నా అన్యాయంగా ఎల్లేష్పును సర్పంచ్ చెప్పుతో కొట్టాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

Latest Updates