ఆన్ లైన్ లో బుక్ చేసిన ఇసుకలో మహిళ అస్థిపంజరం

రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ఇసుక బుక్ చేసిన వ్యక్తికి అందులో మనిషి పుర్రె రావడం కలకలం రేపింది. స్టాక్ యార్డు నుంచి  ఆన్ లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసిన  శ్రీనివాస్ రెడ్డి.. ఆ ఇసుక తన స్థలానికి చేరిన తర్వాత గమనించగా.. అందులో అస్థిపంజరం తలభాగం కనిపించింది.  దీంతో అనుమానం వచ్చి స్టాక్ యార్డుకి వెళ్లి అందులో పరిశీలించగా ఓ అస్థిపంజరం ఉన్నట్లు గుర్తించాడు.  ఇసుకలో చేయి భాగం ఓ చోట, మరో ఎముక భాగం ఓ చోట చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చేతి ఎముకకు ఉన్న గాజుల ఆధారంగా ఆ అస్థిపంజరం ఓ మహిళ ది అని తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు  ఎల్బీ నగర్ ఇంచార్జ్ డీసీపీ యాదగిరి ఘటన స్థలాన్ని  పరిశీలించగా.. ఆ ఇసుకలో మహిళ చీర కూడా కన్పించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates