ఇంజనీరింగ్ విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాది

విజయవాడ: తనను ప్రేమించడం లేదనే ఆగ్రహంతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. యువతి ఇంటికి వెళ్లి.. కత్తితో గొంతు కోసేశాడు.. అనంతరం తనను తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజపురంలోజరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న దివ్య తేజస్వినిని స్థానికంగా ఉంటున్న కట్టు స్వామి అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అయితే ఆమె పట్టించుకోలేదు. దీంతో కోపోద్రికుడైన కట్టుస్వామి ఇవాళ ఉదయం నేరుగా యువతి ఇంటికి వెళ్లాడు. హఠాత్తుగా కత్తి తీసి ఆమె గొంతు కోసేశాడు. అనంతరం తనను తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కేకలు వేస్తూ విలవిలాడుతున్న తేజస్వినిని హుటాహుటిన ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు.తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతి చెందింది. నిందితుడు కట్టుస్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Latest Updates