మీడియా గొంతు నొక్కుతున్నరు

తెలంగాణ, ఏపీ సర్కార్లపై జర్నలిస్టుల మండిపాటు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను హరిస్తున్నాయని ఆలిండియా వర్కింగ్ జర్నలి స్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కె. కోటేశ్వరరావు ఫైర్ అయ్యారు. జర్నలిస్టుల హక్కులు కాలరాసేలా జగన్ జీవోలు విడుదల చేస్తే, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

జర్నలిస్టుల ఎదుగుదలకు, ఎలక్ట్రానిక్ మీడియా చట్టబద్ధతకు ప్రభుత్వం చొరవ చూపాలనే డిమాండ్లతో ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో బుధవారం జంతర్‌‌‌మంతర్‌‌‌‌లో రెండో రోజు ఆందోళన చేశారు. ఏపీలో జీవో నెంబర్ 2430, తెలంగాణలో జీవో నెం బర్ 239 జర్నలిస్టుల గొంతులు నొక్కేలా ఉన్నాయని కోటేశ్వరరావు అన్నారు.

Latest Updates