రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు

కొడకండ్లలో ప్రారంభోత్సవం చేయనున్న సీఎం కేసీఆర్ 

వరంగల్:  రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు కేసీఆర్. ప్రారంభోత్సవం అనంతరం జరిగే కార్యక్రమంలో రైతులు, ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారు.

ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టడం వెనుక ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను సీఎం తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఆహ్వానించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొంటారు.

For more news…

ఒత్తిడి నుండి రిలాక్స్ కోసం కొత్త కాన్సెప్ట్

బ్రెయిన్ స్ట్రోక్ వస్తే.. ఇంజెక్షన్ తో నయం చేయవచ్చు

Latest Updates