ప్రైవేటు బ్యాంకుల డబ్బు వేట

ఐసీఐసీఐ బ్యాంక్క్యూఐపీ కి రూ.62 వేల కోట్ల విలువైన బిడ్లు

రూ.10 వేల కోట్లు సేకరించిన యాక్సిస్ బ్యాంక్

హెచ్ డీఎఫ్ సీకి రూ.10 వేల కోట్లు

న్యూఢిల్లీ: కరోనా వల్ల బ్యాంకుల క్యాపిటల్ తగ్గిపోవడంతో బ్యాంకులు, ఎన్ బీఎఫ్‌ సీలు క్యూఐపీ, క్యూఐబీ ఇష్యూల ద్వారా నిధులను సమీకరిస్తున్నాయి. ఫలితంగా బ్యా లన్స్ షీటును బలోపేతం చేసుకుంటున్నాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, హెచ్​డీఎఫ్​సీ, ఫెడరల్ బ్యాంక్‌​, స్టేట్ బ్యాంకులు నిధులు సేకరించాయి. ఐసీఐసీఐ బ్యాంకు రూ.15 వేల కోట్లు సేకరించడానికి బిడ్స్ ను ఆహ్వానించింది. క్యాలిఫైడ్ ఇన్ స్టిట్యూట్ యూషనల్ ప్లేస్ మెంట్ (క్యూఐపీ) విధానంలో ఇష్యూకు రాగా, రూ.62 వేల కోట్ల విలువైన షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. ఇష్యూ ఫ్లోర్ ప్రైస్ ను రూ.351.36గా నిర్ణయించారు. అంటే ఇన్వెస్టర్ కనీసం రూ.351 లేదా కంటే అంతకంటే ఎక్కువ మొత్తానికి బిడ్ వేయాలి. ఫైనల్ ప్రైస్, కేటాయింపుపై ఈనెల 14న నిర్ణయం వెలువడుతుంది.

యాక్సిస్ బ్యాంకు క్యూఐబీ ఇష్యూ సక్సెస్

క్వాలిఫైడ్ ఇన్ స్టిట్ యూషనల్ బయర్స్ (క్యూఐబీ ) ద్వారా రూ.10 వేల కోట్లు సేకరించామని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. ఇష్యూ 3.5 రెట్లు సబ్​స్క్రయిబ్​ అయిందని, 70కిపైగా బిడ్స్ వచ్చాయని బ్యాంకు ఎండీ అమితాబ్​ చౌదరి ప్రకటించారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ , ఆదిత్యబిర్లా సన్ లైఫ్​ మ్యూచువల్ ఫండ్, ఫిడిలిటీ ఇన్వె స్ట్​మెంట్స్ , టీరో ప్రైస్ , బజాజ్ లైఫ్​ ఇన్సూరెన్స్, మ్యా క్స్ లైఫ్​ ఇన్సూరెన్స్ లు ఇష్యూలో పాల్గొన్నా యి. బ్యాంకు ఒక్కో షేరుకు రూ.420.10 చొప్పున 23.8 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టింది. ఫ్లోర్ ప్రైస్ ధర కంటే ఇది ఐదు శాతం తక్కువ. ఈ ఇష్యూ ఫలితంగా బ్యాంకు పెయిడ్‌అప్‌ క్యాపిటల్ రూ.612 కోట్ల వరకు పెరిగింది. క్యాపిటల్ అడెక్వసీ 19.1 శాతానికి చేరింది.

హెచ్ డీ ఎఫ్ సీకి రూ.10 వేల కోట్లు

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్​డీఎఫ్​సీ క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.10 వేల కోట్ల ఈక్వి టీ క్యాపి టల్‌​ సేకరించిం ది. ఇందుకోసం షేరు రూ.1,760 వద్ద 5.68 కోట్ల ఈక్వి టీ షేర్లను క్వా లిఫైడ్ ఇన్వె స్టర్లకు అమ్మింది. సింగపూర్ ప్రభుత్వం, ఇన్వెస్కో ఫండ్ వంటివి షేర్లు కొన్నాయి. ఎన్ సీడీల ద్వారా కూడా మరో రూ.3,693 కోట్లను సేకరించినట్టు హెచ్​డీఎఫ్​సీ తెలియజేసింది. ఒక్కో వారంటుకు రూ.180 చొప్పున 1.70 లక్షల వారంట్లు జారీ చేయడం ద్వారా నిధులు సమకూర్చుకుంది. బయర్స్ కు త్వరలోనే సెక్యూరిటీలను కేటాయిస్తామని కంపెనీ ప్రకటించింది. యాక్సిస్ , ఐసీఐసీఐ, కోటక్ బ్యాక్ , మోర్గన్ స్టాన్లీ, పీఈటీ, జేఎం ఫైనాన్షియల్ వంటి కంపెనీలు ఎన్సీడీలను కొన్నాయి.

Latest Updates